మధుమేహం ఖచ్చితంగా వీళ్లకు వచ్చే అవకాసం ఉంది..., జాగ్రత్త

updated: February 27, 2018 13:04 IST

మధుమేహ వ్యాధి ఇటీవల మన దేశంలో బాగా పెరిగినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందని, హైదరాబాద్‌ మధుమేహ నగరంగా ముందుందుని సర్వే తెలుపుతోంది. చాపకింద నీరులా మధుమేహం వ్యాప్తి చెందుతోంది. ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మనదేశం ప్రసిద్ధికెక్కింది. సుమారుగా 50 మిలియన్లకి పైగా ఇప్పటికే మధుమేహం బారిన పడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకి పెరగవచ్చని ఒక అంచనా. మధుమేహం ఉందనేది, ఉన్నవాళ్లకు 50 శాతం మందికి తెలియనే తెలియదు. తెలుసుకున్న వాళ్లలో 50 శాతం మంది మాత్రమే తగిన వైద్యాన్ని తీసుకుంటున్నారు. అసలు ఈ మధుమేహం ఎవరికి ఎక్కువ వచ్చే అవకాసం ఉంది...

ఇతర దేశాల్లో కంటే మనదేశంలో 10 సంవత్సరాలు ముందుగానే మధుమేహం బయటపడటం విశేషం. మన దేశంలో స్థూలకాయం కంటే బొజ్జ ఎక్కువ ఉన్న వాళ్లలో నడుము, తుంటి కొలత నిష్పత్తి ఎక్కువగా ఉన్న వాళ్లలో ఇది తరచూ కనిపిస్తుంది. 

షుగర్ రావడానికి ఎవరికి అవకాశం ఉంది?

కుటుంబంలో తల్లిదండ్రులకు ముధుమేహం ఉంటే 

అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్లు

ఎక్కువ శ్రమలేని జీవితాన్ని గడుపుతున్న వాళ్లు

ఎక్కువ ఒత్తిడికి గురవుతున్న వాళ్లు 

కొలెస్ట్రాల్‌ (లేక) ట్రైగ్లిజరైడ్‌ స్థాయి ఎక్కువగా ఉన్నవాళ్లు 

నాలుగు కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చిన స్త్రీ

స్టెరాయిడ్‌ మందులు తీసుకునేవాళ్లకు 

షుగర్ వచ్చే అవకాసం ఎక్కువ అని చెప్పాలి.

అలాగే మధుమేహం వచ్చే రిస్క్‌ ఎలా ఉంటుంది?

తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే-99%

తల్లిదండ్రులో ఒకరికి మధుమేహం ఉండి రెండోవాళ్ల 

బంధువులెవరికైనా మధుమేహం ఉంటే -75%

బంధువులెవరికైనా మధుమేహం ఉంటే - 50%

తల్లిదండ్రులకుగాక దగ్గర బంధువులకెవరికైనా మధుమేహం ఉంటే -25%

comments